AMC Boath: శనగల కొనుగోళ్లు ప్రారంభించిన చైర్మెన్‌ బొడ్డు గంగారెడ్డి

సిరా న్యూస్, బోథ్‌:

శనగల కొనుగోళ్లు ప్రారంభించిన చైర్మెన్‌ బొడ్డు గంగారెడ్డి

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డ్‌లో శనగ కొనుగోళ్లను మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బొడ్డు గంగారెడ్డి ప్రారంభించారు. మంగళవారం మార్కెట్‌ యార్డ్‌లో ఈ మేరకు అధికారులు, నాయకులతో కలిసి కాంటాకు పూజలు నిర్వహించారు. అనంతరం రైతులను సన్మానించి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు పండించిన శనగలను పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ డా. సంధ్యారాణి, మార్క్‌ఫెడ్‌ డీఎం ప్రవీణ్‌ రెడ్డి, ఎఎంసీ కార్యదర్శి నార మనోహర్,  సొసైటీ సీఈవోలు నాగభూషణ్, గోలి స్వామి, కో ఆప్షన్‌ సభ్యులు తాహేర్‌ బిన్‌ సలీం, ఎంపీటీసీ కుర్మే మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *