అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడీ సెంటర్లలో సీసీ కెమెరా, బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి

పాత ఫోన్లు తీసుకొవాలి కొత్త ఫోన్లు, ట్యాబ్ లు ఇవ్వాలి.

సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్

సిరా న్యూస్,జగిత్యాల;
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంగన్వాడీ కేంద్రాలలో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒక పూట బడి మే నెలంతా అంగన్వాడీ టీచర్స్ ,హెల్పర్స్ కి ఒకేసారి సెలవులు ఇవ్వాలని, పాత ఫోన్లు తీసుకొవాలని, కొత్త ఫోన్లు ట్యాబ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ అంగన్వాడీ టిచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏ.రజిత మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ టిచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, మా జివితాల్లో మార్పు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే మిమ్మల్ని దోంగలు గా చిత్రికరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి సెంటర్లలో సిసి కెమెరా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువస్తున్నారని ఈ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విదంగా హెల్పర్స్ ను పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకే పెంచాలని అట్లాగే 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కి ఇచ్చిన హామీలు అమలు జరపాలని డిమాండ్ చేశారు.ఫిబ్రవరి నెల వేతనం వెంటనే చెల్లించాలని, జిల్లాల్లో ఆగిపోయిన మినీ అంగన్వాడీ టీచర్స్ కి మెయిన్ టీచర్స్ గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తొందరలో జిల్లాలు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆన్లైన్ సమస్యల వల్ల ఆగిపోయిన 1200 మందికి 4,5 రోజుల్లో వేతనాలు వచ్చే విధంగా చూడాలని, పాత ఫోన్లు వల్ల గ్రామాల్లో సర్వే లు చెయ్యటం ఇబ్బంది అవుతుందని, 2జీ ఫోన్లు తీసుకొని వాటి స్థానంలో కొత్త ఫోన్లు లేదా ట్యాబ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సంధర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలోని
జిల్లా ఏవో కి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రమేష్, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ చంద్రయ్య, వినోద్, అంగన్వాడీ యూనియన్ నాయకులు శారద, స్వప్న, నాగమణి, స్వప్న, జయప్రద,సరిత,మరియ,సురేఖ,వి.లక్ష్మి, గంగా జమున, జ్యోతి తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *