సిరా న్యూస్,రాజోలు;
రాజోలు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన పార్టీ జనవాణి కన్వీనర్, మాజీ ఐఏఎస్ అధికారి దేవా వర ప్రసాద్ పేరు ఖరారు అయింది. అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని నియోజకవర్గానికి మలికిపురం విచ్చేసిన సందర్భంగా ఆయనకు పలికిన జనసేన, టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేవ వరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తనకు అవగాహన ఉందని, గత ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు.. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాను. రాబోవు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధిమా వ్యక్తం చేసారు.