సిరా న్యూస్,కుప్పం;
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రశ్నస్తే సొంత పార్టీ మహిళలైన ఎవరైనా ఒక్కటే వైసీపీ కి బూతులతో రెచ్చిపోయారు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా శాంతిపురం మండలం మోరసనపల్లి పంచాయితీ వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య నీల ను వైకాపా నేతలే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అభివృద్ధి ఏది అని ప్రశ్నిండమే ఆమె చేసిన తప్పు. ఈ మేరకు ఆమె ఒక సెల్ఫీ విడుదల చేసారు. తన మీద వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను స్వయంగా ఆమె స్క్రిన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వైసీపీ బ్యాచ్ పెట్టిన పోస్టులు చూస్తుంటే మహిళల మీద వారికున్న అభిప్రాయం ఇట్టే తెలుస్తోందని అన్నారు.