సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి మద్దతుగా బీజేపీ నేత పడకంటి రమాదేవి ప్రచారానికి వెళ్లారు.ఈరోజు గ్రామంలోని జీఎం కల్యాణ మండపంలో బిఆర్ఎస్ ప్రచార సభ ఏర్పాటు చేశారు. సభకు వెళ్తున్న క్రమంలో గ్రామ యువకులు అడ్డుకున్నారు.తమ జీవితాలతో అడుకున్నవాని,మమ్మల్ని వాడుకోని వేరే పార్టీకి ప్రచారం చేయడంపై గ్రామ యువకులు, బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు..రమాదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చేసేదేమీ లేక ప్రచార సభ వద్దకు పరుగులు తీశారు. గ్రామ యువకులు కూడా ఆమె వెంట వెళ్తూ రమాదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు