సిరా న్యూస్,కొత్తపేట;
వారిద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు… కానీ పార్టీలు వేరు.. అన్న తెలుగుదేశం… తమ్ముడు జనసేన.. వారే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం చెందిన తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యానందరావు, జనసేన నేత బండారు శ్రీనివాస్.
ఇద్దరు టికెట్ కోసం ప్రయత్నించారు.. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశారు.. అయితే ఈసారి ఎన్నికల్లో పొత్తు ధర్మం ప్రకారం తెలుగుదేశం పార్టీకి కొత్తపేట సీటు ఖరారు చేసి అన్న బండారు సత్యానందరావుని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే జనసేన నేత శ్రీనివాస్ దీంతో కంగుతిన్నారు… అన్నదమ్ముల మధ్య పరస్పర వివాదం … ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నా ఈసారి ఎన్నికల్లో ఒకటయ్యారు.. పొత్తు ధర్మం పాటించి అన్న సత్యానందరావు విజయానికి తమ్ముడు శ్రీనివాస్ కంకణం కట్టుకున్నారు. ఎన్నికల ధర్మం అంటూ అన్నదమ్ములు ఇద్దరు ఒక్కటే అయ్యారు.