ఇక నోటు తో ప్రచారం

సిరా న్యూస్, ఖమ్మం;
ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రచారం ముగియడంతో ఓట్ల వేట్లలో నోట్లు  పంచేందుకు  నేతలు సిద్దమవుతున్నారు.  పది నియోజక వర్గాల్లో ఎన్నికల భరిలో నిలిచిన అభ్యర్దుల భవితవ్యాన్ని తెల్చనున్నారు. ప్రచారం  ముగియడతో  ఓట్ల వేటలో తేరవెనుక తాయిలాలకు తెర తెర లేపారు. ఖమ్మం జిల్లాలో పది నియోజక వర్గాల్లో 250 మంది అభ్యర్దులు గెలుపు కోసం ఓటర్ మహాశయుడిని ప్రసన్నం చేసుకునేందుకు తెర వెనక తాయిలాల కు తెర తీసారు. ఒక్కో నియోజక వర్గంలో  ఒక్కో రేటుకు అభ్యర్దులు తెర లేపారు. పాలేరులో ఇప్పటికే  ఓటుకు 4 వేల ధర పలుకుతుంది. ఎస్పీ నియోజక వర్గంలో 5 వేలకు ధర పలికే పరిస్థితి కి దారులు పడుతున్నాయి.   తాజా ఎమ్మేల్యేలు కోటాను కోట్ల రూపాయిలు వెచ్చించైన పదవిని నిలబెట్టుకునేందుకు తాపత్రయడుతుంటే పదవి అందిపుచ్చుకోవాలని కొత్తగా పోటీ చేస్తున్నవారు సైతం ఆస్తులు పుస్తేలు అమ్మైనా అందులో సగం అయినా ఇస్తామని ఓటర్ ను ఆకట్టుకొనే  పనిలో పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో  ప్రధాన పార్టీ లైన కాంగ్రేస్,బిఆర్ఎస్.బిజెపి.జనసేన వామ పక్షాల మధ్య ముక్కోణపు పోటి నెలకొనడంతో ఓట్ల కొనుగోలుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.గెలుపు పై ధీమాతో ఉన్న అభ్యర్దులు ఖర్చుకు వెనకాడకుండా మందుకు వేళ్తున్నారు. పోలింగ్  సమయం మరి కొద్ది గంటలే ఉండటంతో ఓటర్ల ను ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారు. కుల సంఘాలు మహిళా సంఘాలను మచ్చిక చేసుకొని ముకుమ్మడిగా ఓట్ల కొనుగోలుకు నోట్ల నజరాన తో సంసిద్దమయ్యారు. అధికారులు ఏంత నిఘా పెట్టిన అనువైన దారుల్లో ఓటర్లను ప్రలోభ పెట్టె పనిలో మునిగి తెలుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *