హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన
సిరా న్యూస్,అనంతపురం;
నగరంలోని శ్రీనివాస న్యూరో హాస్పిటల్ నందు ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన అంకిత (19) అనే అమ్మాయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం మెదడులో గడ్డ ఉందని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. గత ఆరు నెలలుగా చికిత్స కోసం దాదాపు రూ.8లక్షలకు పైగా ఖర్చు చేశామని, అయినా మా కూతురు మాకు దక్కలేదని తల్లిదండ్రులు మీడియా ఎదుట వాపోయారు. శ్రీనివాస న్యూరో హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డను పోగొట్టుకున్నామని, తమ బిడ్డకు రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించే సమయంలో అది వికటించి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.