విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలి
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడే విధంగా పదో తరగతి పరీక్షల్లో ఫలితాలు సాధించాలి
కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి
వోడితల ప్రణవ్
సిరా న్యూస్,హుజురాబాద్;
చదువుకు పేదరికం కాదని, చదువుకోడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని, కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ త్వరలోనే అందజేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు అన్నారు.
శుక్రవారం హుజరాబాద్ పట్టణంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి పిల్లలకు పరీక్ష ప్యాడ్ల పెన్నుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రణవ్ మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల బాగుకోసం పరీక్ష సామాగ్రి ఇవ్వడానికి ముందుకు వచ్చిన సరిత జైపాల్ రెడ్డి ల దాన గుణం అభినందనీయమని అన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు కుటుంబానికి పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని ఆయన సూచించారు. అన్నివేళలా విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం తరపున అదనపు గదుల నిర్మాణం కొరకు నిధులు కూడా మంజూరు చేస్తామని,
పాఠశాలకు ఎలాంటి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. అనంతరం హుజరాబాద్ ఎం ఈ ఓ కేతిరి నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు 10/10 మార్కులు సాధిస్తే తన వంతుగా ప్రోత్సాహం బహుమతి కింద 5116 రూపాయలు ప్రతి విద్యార్థికి అందజేస్తానని
అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.ఇ.ఓ.
కె. వెంకట నరసింహారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు సమ్మి రెడ్డి , బాలికల జిల్లా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు
బి తిరుమల,జయన్న ఫౌండేషన్ పరీక్ష ప్యాడ్ల దాతలు సరిత జయపాల్ రెడ్డి, ఎంపీటీసీ సింగపూర్
రిటైర్డ్ హెడ్మాస్టర్
వి.రత్నo,కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, యేముల పుష్పలత. కిరణ్, తో పాటు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
=====================