జ్ఞానవాపి సర్వే రిపోర్టుకు మరో 21 రోజులు గడువు కోరిన ఏఎస్ఐ

సిరా న్యూస్,వారణాసి ;
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ (ASI) వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది. దీనికి ముందు నవంబర్ 17 వరకూ ఏఎస్ఐకు కోర్టు గడువు ఇవ్వగా ఏస్ఐ తరఫు న్యాయవాది మరో 15 రోజులు సమయం కోరారు. కాగా, టెక్నికల్రిపోర్ట్ అందుబాటులో లేనందున ఏఎస్ఐ మరింత గడువు కోరినట్టు జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు.
వారణాసిలోని కాశీ విశ్వనాథాలయానికి దగ్గరలోని జ్ఞానవాపి ప్రాంగణంలో ఏఎస్ఐ సర్వే జరుపుతోంది. 17వ శాతాబ్దంలో అక్కడున్న హిందూ ఆలయాన్ని కూల్చేసి దానిపై మసీదు కట్టారా అనేదినిర్దారించేందుకు ఏఎస్ఐ ఈ సర్వే చేపట్టింది. సర్వే పూర్తయిందని, నివేదిక పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని నవంబర్ 2న కోర్టుకు ఏఐఎస్ విజ్ఞప్తి చేసింది. దీంతో నవంబర్ 17 వరకూ, ఆతర్వాత నవంబర్ 28 వరకూ గడువును కోర్టు పొడిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *