విద్యుత్ వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

సి జి ఆర్ ఎఫ్ చైర్మన్ తిరుమల్ రావు
.
సిరా న్యూస్,కమాన్ పూర్;
విద్యుత్ వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పి ఎస్ ఎన్పీడీసీఎల్ సిబ్బందికి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఫోరం తిరుమల రావు అన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని టీ.ఎస్.ఎన్.పీ.డీ.సీ.ఎల్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఫోరం (సీజీఆర్ఎఫ్) చైర్మన్ కే. తిరుమల్ రావు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లెలో గల కేఎన్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిస్కార వేదిక ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలపై వినియోగదారులతో సదస్సు నిర్వహించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారులు వినతి పత్రాలు అందాజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాడానికి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఉందని తెలియజేయడం కోసం సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ సమస్యలు ఏమైన ఉంటే వాటి పరిష్కారం కోసం ఈమెయిల్ సీపీసీజీఆర్ఎఫ్@టిఎస్ఎన్ఎ్పడీసీఎల్.ఇన్ ద్వారా లేదా సెల్ నంబర్లు 9440811299, 8333923840, 9491307004 కు వాట్సాఫ్ ద్వారా వినియోగదారులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకరావచ్చునని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గృహజ్యోతి పథకంలో అర్హులైన 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులు జీరో బిల్లులు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారు మండల ప్రజా పరిషత్ కార్యాలయాలకు వెళ్లి అక్కడ ప్రజాపాలన కేంద్రంలో డాటా ఆఫరేటర్ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ విసయమై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందని మరికొన్నింటికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పేరు మార్పిడి, ఇంటిపై నుండి విద్యుత్ వైర్లు తొలిగించాలని, విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని, విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయాలని, క్యాటగిరి మార్పిడిలాంటి తదతర సమస్యలను పరిష్కరించాలని వినియోగదారులు ఈ సదస్సులో విన్నవించారు. ఈ సమావేశంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు ఎన్. నరెందర్, ఆర్. చరణ్ దాస్, ఏడీ విజయ్ పాల్సింగ్, డీఈ ఈశ్వర్ ప్రసాద్, ఎంపీపీ రాచకొండ లక్ష్మి, మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు, కమాన్ పూర్ ఇంచార్జీ ఏఈ రవివర్మలతో పాటు సీనియర్ల ఎన్ని ఇన్స్పెక్టర్ గణపతి లైన్ ఇన్స్పెక్టర్లు మతిన్ కృష్ణ లైన్మెన్లు రవి శివకుమార్ జేఎల్ఎం జలపతి కుమార్ చంద్రమౌళి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *