సిరా న్యూస్, పెద్దపల్లి:
ఆరు గ్యారెంటీ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 23 కళ్యాణ లక్ష్మి, 17 షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 40 మంది లబ్ధిదారులకు 40 లక్షల 4వేల 640 రూపాయలవిలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంతో పాటు, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారాడబ్బుతో సహా తులం బంగారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దశలవారీగా అమలు చేయడం జరుగుతుందని, ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని అన్నారు.ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడంజరుగుతుందని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాద్రి రామయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లుఇవ్వనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు రానున్నాయని తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ప్రాధాన్యత క్రమంగా ఇల్లు కేటాయించడం జరుగుతుందని,ఇండ్ల కోసం ఎవరికీ డబ్బు ఇవ్వవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పిటిసి బండారి రామ్మూర్తి, తాసిల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ గౌడ్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.