సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ ఓ సి పి వన్ ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణను సీ అండ్ ఎం డి బలరాం నాయక్ అభిహాందించారు.
రామగుండం-3 ఏరియాలోని ఓ.సి.-1 ఉపరితల గని లో శుక్రవారం నిర్వహించిన “ప్రొడక్షన్ డే” లోభాగంగా 20.5 షావెల్ పనిగంటలతో రోజూ వారి ఉత్పత్తి కి 5000 టన్నులు అదనంగా అనగా మొత్తం 18000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన ఓ.సి.-1 ఉపరితల గని ప్రాజెక్ట్ అధికారి ఎన్.రాధాకృష్ణతో పాటు,ఉద్యోగులు, సూపర్వైసర్లకు, అధికారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ శుభాభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా జి.యం. కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ.సి.-1 ఉపరితల గని ఉద్యోగులతో మాట్లాడుతూ ఉత్పత్తి, ఉత్పాదకతలో ముందుండటం శుభపరిణామం అని, వయస్సుతో తేడా లేకుండా యువఉద్యోగులతో పోటీ పడుతూ విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం చాలా సంతోషం అన్నారు. మున్ముందు ఇదే ఒరవడిని కొనసాగిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. తదుపరి డైరెక్టర్ (ఆపరేషన్స్ &పర్సనల్) శ్రీ ఎన్.వి.కె. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఓ.సి.-1 ఉపరితల గని సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ,సింగరేణి సంస్థ లోనే మొదటి ఉపరితల గని అయినటువంటి ఓ.సి.-1 బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత,రవాణాలో ముందుంటూ ఇతర గనులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ గారు హాజరైన ప్రతి ఉద్యోగితో ప్రత్యేకంగా మాట్లాడి వారిని అభినందిస్తూ ప్రోత్సహించడంతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆర్.జి-3 జి.యం. ఎన్.సుధాకర రావు సంబంధిత ఉద్యోగులలందరికీ శుభాభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేట్ జి.యం.(ఆర్.&డి,ఎస్టేట్స్) ఎస్.డి. ఎం. సుభాని, ఎస్వో టుడైరెక్టర్ (ఆపరేషన్స్) డి.లలిత్ కుమార్, ఇంఛార్జి జి.యం. ఎన్.రాధాకృష్ణ, డి.జీ.ఎం, ఐ. ఇ . డి. కే.చంద్ర శేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీనివాస్, మేనేజర్ ఉదయ్ హరిజన్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డి.వై.పి.యం.గుర్రం శ్రీహరి, గుర్తింపు సంఘ ప్రతినిధి డి.టి.రావు, ప్రాతినిధ్య సంఘ ప్రతినిధి గడ్డం తిరుపతి, అధికారులు క్రాంతి,శ్రీనివాస్, సూపర్వైజర్ సాంబయ్య, ఆపరేటర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
==================