ఏపీలో  హైవోల్టేజ్ పాలిటిక్స్…  

ఎన్నికల ఖర్చు ఆందోళన
సిరా న్యూస్,విజయవాడ;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ ఊహించనంత  హైవోల్టేజ్ పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సారి మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలతో బీఆర్ఎస్ హోరాహోరీ తలపడుతుంది. ఎవరు ముందున్నారు.. ఎవరు వెనుకబడ్డారన్న సంగతి పక్కన పెడితే.. చివరి బాల్  వరకూ విజయం కోసం ప్రయత్నించడమే కీలకం. ఆ దిశగా రాజకీయ పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఎప్పటికప్పుడు  ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికి తగ్గడం లేదు. అదే్ సమయంలో ఎలక్షనీరింగ్ విషయంలోనూ తమ సత్తా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అంటే.. డబ్బులు ఖర్చు  పెట్టడమే. తెలంగాణ రాజకీయాల్లో చివరి క్షణాల్లో మార్పులు తీసుకు రావడానికి  రాజకీయ పార్టీలు చేయని  ప్రయత్నాలు అంటూ లేవు. ఎంత తీవ్రంగా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేది రైతు  బంధు అంశంతోనే అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగా రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కానీ అసలు విషయం కంటే.. కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందనే ప్రచారం బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా చేశారు. రేవంత్ రెడ్డి రాసినట్లుగా ఉన్న ఓ లెటర్, కొన్ని మీడియా సంస్థల క్లిప్పింగ్‌తో విస్తృతంగా  బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడాల్సి వచ్చింది.  అయితే ఇక్కడ వాటిని  నమ్మేవారు కూడా ఉంటారు బీఆర్ఎస్‌కు కావాల్సింది అదే. ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాదు.. ఏ పార్టీది అయినా అదే వ్యూహం. తప్పా ఒప్పా అన్నది కాదు. ప్రజల్ని  నమ్మించగలిగి.. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమో.. లేదా.. ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకం చేయడమో కీలకంగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *