సిరా న్యూస్, భీమదేవరపల్లి:
అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి..
– మండల కన్వీనర్ బొల్లం రాజు..
ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన అడుగుజాడల్లో నడవాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం భీమదేవరపల్లి మండల కన్వీనర్ బోల్లంపల్లి రాజు అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాలయ్య, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. రాంనగర్, ముత్తారం గ్రామాలలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీలు వేయడం జరిగిందని అన్నారు. రాంనగర్ అధ్యక్షులుగా బొనగిరి సుదర్శన్, ఉపాధ్యక్షులుగా కనకం సంపత్, ప్రధాన కార్యదర్శిగా వెంగెల పోచయ్య, గౌరవ సలహాదారుడిగా కనకం నరేశ్, కమిటీ సభ్యులుగా నూనె రవి, డప్పు సృజన్, డప్పు కృష్ణ, వెంకన్న, శంకర్, ప్రశాంత్ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ముత్తారం అధ్యక్షులుగా రెనుకుంట్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మ్యాక స్వామి, ఉపాధ్యక్షులుగా రేనుకుంట్ల విద్యాసాగర్, కోశాధికారిగా పారునాందుల మహేందర్, కార్యదర్శిగా కడారి ప్రభాస్, ప్రచార కార్యదర్శులుగా తాడురి నిరంజన్, తాడురీ చిరంజీవి, తదితరులు ఎన్నుకున్నట్లు తెలిపారు.