Gopal Reddy: రాథోడ్‌ రమేష్‌ రెబల్‌ ఆటలు సాగవు

సిరా న్యూస్, ఖానాపూర్‌:

రాథోడ్‌ రమేష్‌ రెబల్‌ ఆటలు సాగవు
– బీజేపీ సీనియర్‌ నాయకులు పొద్దుటూరు గోపాల్‌ రెడ్డి

బీజేపీ పార్టీని ధిక్కరిస్తూ రాథోడ్‌ రమేష్‌ ప్రారంభించిన రెబల్‌ ఆటలు సాగవని బీజేపీ పార్టీ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ సీనియర్‌ నాయకులు పొద్దుటూరు గోపాల్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాథోడ్‌ రమేష్‌ బీజేపీ పార్టీలో రావడంతో పార్టికి ఎలాటి లాభం కలగలేదన్నారు. జిల్లాలో బీజేపీ బలపడిన తీరు చూసి, ఎంపీ టికెట్‌ కోసం స్వార్థంతోనే ఆయన పార్టీలో చేరారని విమర్శించారు. ఇప్పుడు అదిష్ఠానం ఎంపీ టికెట్‌ గొడం నగేష్‌కు కేటాయించడంతో, బీజేపీ రెబల్‌గా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారని, ఈ పరిణామాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న రాథోడ్‌ రమేష్‌ పార్టీలో ఉన్న ఒకటే, పార్టీని వీడిన ఒకటేనని అన్నారు. పార్టీ టికెట్‌ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేయకుండా, రెబల్‌గా పోటీ చేస్తానంటే ఆయనకే నష్టమని అన్నారు. తామంత వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *