సిరా న్యూస్,హైదరాబాద్;
బోరబండ,లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జ్యోతి (33) ఆత్మహత్య కేసులో భర్త విజయ్కుమార్ను బోరబండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్నగర్కు చెందిన జ్యోతి(33) 2023 అక్టోబర్ 13న ఇద్దరు పిల్లలు అర్జున్(4) ఆదిత్య(1.5)తో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని భర్త విజయ్కుమార్ జ్యోతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఆత్మహత్య జరిగిన రోజు నుంచి జ్యోతి తల్లిదండ్రులు భర్త విజయ్కుమార్పై అనుమానం వ్యక్తం చేస్తూ తన కూతురిని హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్త విజయ్కుమార్ను నిందితుడిగా పరిగణిస్తూ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
===============