సిరా న్యూస్,చిగురుమామిడి
ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వ రాయితీ
* సీఈవో సిద్దంత్ లోహియా
* ఆయిల్ ఫామ్ నర్సరీ సందర్శన
ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నట్లు లోయియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సిద్దంత్ లోహియా తెలిపారు.మంగళవారం చిగురుమామిడి మండలంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని సందర్శించారు.అనంతరం బొమ్మనపల్లిలో రైతులతో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సాంప్రదాయ పంటలు కాకుండా..పంటలను మార్పిడి చేసి అధిక లాభాలను పొందే ఆయిల్ ఫామ్ పంటను సాగుచేయాలన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1700 వందల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రాయితీ కింద ఎకరానికి 4,200 ఎకరానికి రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. డ్రిప్ పరికరాలకు ఎస్సీ ఎస్టీలకు 100 శాతం. చిన్న సహకా రైతులకు 90శాతం బిసి లకు 80 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆల్ఫా మొక్కలు కావలసిన రైతుకు ఫీల్డ్ ఆఫీసర్ మ్యాదారవేని ప్రవీణ్ కుమార్ ను సంప్రదించాలని తెలియజేశారు. కార్యక్రమంలో రిజోనల్ మేనేజర్ విజయ్ కుమార్, బొమ్మనపల్లి రైతులు కత్తుల రమేష్, ముత్యాల కొమురయ్య, తోట శ్రీనివాస్, దరిపెల్లి సంపత్, బండి చేరాలు, మేడుదుల కొంరయ్య, కంది శంకర్, దరిపెల్లి సంపత్, బండి రాజు, దుడ్డెల రాజు తదితరులు పాల్గొన్నారు.