సిరా న్యూస్,మహబూబ్ నగర్;
బర్రెలక్క.. అలియాస్ శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిరేపుతున్న పేరు. నిరుద్యోగ సమస్యే ప్రధాన అజెండాగా అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టిన బర్రెలక్క.. ఇప్పుడు విపక్ష కాంగ్రెస్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. కొల్లాపూర్ నుంచి బరిలో దిగిన బర్రెలక్క.. ఇప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజీగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో బర్రెలక్క పేరు వింటేనే కాంగ్రెస్ నేతలు కంగారెత్తిపోతున్నారట?బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న పేరు. అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనంగా మారిన పేరు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిరుద్యోగ సమస్యపై చిన్నవీడియో తీసి.. అది బాగా వైరల్ కావడంతో ఫేమస్ అయిన బర్రెలక్క కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో మరింత ఫేమస్ అయ్యారు. ఇక ఆమెను.. ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారనే ప్రచారం.. హైకోర్టు జోక్యంతో భద్రత కల్పించడంతో ఇంకాఇంకా ఫేమస్ అయిపోయారు బర్రెలక్క. అంతేకాదు ఆమెకు ఎన్నికల ఖర్చు కోసం జనమే విరివిగా విరాళాలివ్వడంతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కంచె ఐలయ్య వంటి ప్రముఖులతోపాటు న్యాయవాదులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రచారానికి స్వచ్ఛందంగా రావడంతో ఈ ఎన్నికల్లో పొలిటికల్ స్టార్‌గా మారిపోయారు బర్రెలక్క.తన వీడియో వైరల్ అయిన తర్వాత, ఎన్నికల్లో పోటీ చేస్తానని బర్రెలక్క సోషల్ మీడియాలో ప్రచారం చేసినంతవరకు ఆమెపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ, నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత జరిగిన దాడి ఎపిసోడ్‌తో మొత్తం సీన్ మారిపోయింది