సిరా న్యూస్,బోథ్
శబరిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌటా బి గ్రామంలో శబరిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు గ్రామంలోని గ్రామదేవతలన్నింటికీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .అంతకుముందు శివానంద భారతి స్వామి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆలయంలో హోమ గుండాన్ని నిర్వహించగా భక్తులు హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టడం జరిగింది వేదపండితులు పండరి శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.