సిరా న్యూస్,రాజోలు;
రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో వైసిపి నాయకులు, అధికారులు సమక్షంలో కాట్రేనిపాడు జనసేన సర్పంచ్ అడబాల శ్రీనివాసరావు దుమ్ము దులిపివేసారు. గతంలో నాకు 500 రూపాయలు కరెంట్ బిల్లు వస్తే ఇప్పుడు ఐదు వేల రూపాయలు కరెంట్ బిల్లు వస్తుందని అందుకే మళ్ళీ జగన్ రావాలి. పొన్నమండ నుండి కాట్రేనిపాడు వరకు రోడ్డు ఎక్కడా గుంతలు లేవని అందుకే మరల జగన్ సీఎం కావాలని సెటైర్లు వేశారయన.