సిరాన్యూస్, హుస్నాబాద్
ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి
* రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లాలో ఆకస్మికంగా కురిసిన వడగళ్ల వాన వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో అకస్మాత్తుగా వడగండ్లతో కూడిన భారీ వర్షం పడడంతో వృక్షాలు పడిపోయి, విద్యుత్ స్తంభాల వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరాను కూడా త్వరగా పునరుద్ధరించాలని, పడిపోయిన చెట్లను తొలగించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు మంత్రివర్యులు ప్రకటనలో తెలిపారు.