సిరా న్యూస్,నరసరావుపేట;
రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందుబాబుకి ఇవ్వాలని నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి రామిరెడ్డి తన ఇంట్లోనే ఆత్మహత్యయత్నం చేసారు.అయన విలేకరుల సమావేశంలోనే పురుగుల మందు తాగారు. బంధువులు రామిరెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అరవిందుబాబుకి టిక్కెట్ రాకపోతే ఎంపీ లావు కృష్ణదేవరాయలదే పూర్తి బాధ్యత అని అయన ఆరోపించారు.