సిరా న్యూస్,విశాఖపట్నం;
జేడి ఫౌండేషన్& నిపుణ డవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిశంబర్ 2 న సాంకేతికా ఇంజనీరింగ్ కళాశాలలో మెగా ఎంప్లాయిమెంట్ ఫేర్ ఏర్పాటు చేస్తున్నాని వి.వి లక్ష్మీనారాయణ అన్నారు.
లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాబ్ ఫేర్ కు 50 కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. అక్కడే ఆఫర్ లెటర్ లు కూడా ఇస్తాము. కొంచె వెనుకబడే అభ్యర్ధులకు స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తాము. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్ కు హాజరు కావచ్చాని అన్నారు.
రాజకీయాలపై అయన మాట్లాడుతూ విశాఖ నుంచే పోటీ చేస్తాను. తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం వుంది. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క కు మంచి ప్రచారం కలిగింది. పరిస్ధితిని బాగు చేయడానికి ఆమె రాజకీయాలు ఎంచుకుంది. ఖచ్చితంగా ఆమె ఎన్నికవుతుందని విశ్వసిస్తున్నాను. కొంత మంది మాత్రమే రాజకీలయాల్లో అర్హులనేది ఎక్కడా లేదు. ఏపిలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలి. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే. నియమైన ఓట్ల తొలగింపు పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు.