Aude Shankar:పీపీ ల్యాండ్ పట్టాలను రద్దు చేయాలి

సిరాన్యూస్‌,బేల
పీపీ ల్యాండ్ పట్టాలను రద్దు చేయాలి
* ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆడే శంకర్
బేల మండలంలోని మసాలా కే గ్రామంలో గల సర్వే నంబర్ 3/1, 3/2 పట్టాలను రద్దు చేయాలనీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆడే శంకర్ అన్నారు. బుధ‌వారం బేల మండల తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆడే శంకర్ మాట్లాడుతూ మసాలా కే గ్రామంలో గల సర్వే నంబర్ 3/1, 3/2 లో గల పరన్ పోగ్ భూమిని మడావి బేరుబాయి భ‌ర్త‌ పోతు పేరు మీద లావుని పట్టా చేసి ఇవ్వడం జరిగింది.అసలు ఇలాంటి భూమి అత్యంత నిరుపేద గిరిజన కుటుంబాలకు ఇవ్వాలి కానీ అప్పటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా బైరు బాయి పేరు పైన చేసి ఇవ్వడం జరిగింది. మాడవి బైరుబాయి వారి కుటుంబ సభ్యుల పేరు పైన దాదాపుగా 49 ఎకరాల భూమి ఉందని అన్నారు.
మరి వీరు నిరుపేదలు ఎలా అవుతారని అన్నారు.ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఈ రెండు సర్వే నంబర్ గల పట్టాలను రద్దు చేసి అత్యంత నిరుపేద గిరిజనులకు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మసాలా కే గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *