సిరా న్యూస్,షాద్ నగర్;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామములో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు మృతి చెందారు. గ్రామ శివారులోని ఉప్పారోని కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మక్తగూడ గ్రామవాసులు గరాల కిష్టయ్య,వెంకటేష్ లు శవలై కనిపించారు.ఉదయం పశువులను మేపడనికి వెళ్లిన గ్రామస్తులు చూసి పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను చెరువు లోనుండి తీసి పోస్టు మార్టం కొరకు షాద్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.