సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మున్సిపాలిటీ విద్యానగర్ లో 20 సంవత్సరముల క్రితం నిర్మించిన శ్రీరామ దేవాలయం ను తొలగించాలని బద్వేల్ రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో,ఆర్డీవో తొలగించమనడం దారుణమని విద్యానగర్ వాసులు తెలియజేశారు. ఇప్పుడు ఆలయ నిర్మాణం పై రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలపడంపై స్థానికులు అడ్డుకున్నారు. గత 20 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మాణ దశలో ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు ఏమయ్యారని ప్రశ్నించారు.ఆలయ నిర్మాణ సమయంలో ఏ రెవెన్యూ అధికారి అధికారి అడ్డు చెప్పలేదని ఇప్పుడు అభ్యంతరాలు ఎందుకు వచ్చాయని స్థానికులు అంటున్నారు. గుడికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం తో స్థానిక కౌన్సిలర్ ఎర్ర గొల్ల గోపాలస్వామి సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ సుధ దృష్టికి తీసుకుపోగా తక్షణం ఆమె స్పందించి ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆమె అన్నారు. కాగా దేవాలయం అందరికీ కావలసింది కాబట్టి స్థానికులు మనోభావాలు దెబ్బతీసే విధంగా రెవెన్యూ అధికారులు నడుచుకోవడం ఏమిటి అని ప్రజలు అంటున్నారు. ఇవి అన్ని అధికారులు రామస్వామి దేవాలయం నిర్మాణానికి సహకారాలు అందించాలని కోరుతున్నారు.