Baddenaik: పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత
* వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్
కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి కాలనీలో నివసిస్తున్న నిరుపేద ముస్లిం కుటుంబానికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వైద్య సహాయం నిమిత్తం 12,000 రూపాయలు వారికి అంద‌జేశారు.ఈ సందర్భంగా చైర్మన్ బద్దేనాయక్ మాట్లాడుతూ జీలాన్ అనే వ్యక్తి పక్షవాతానికి గురై సంవత్సరోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని,మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కు తెలియడంతో మా సభ్యుల అందరూ కలసి వారికి నేడు వైద్య సేవల నిమిత్తం 12,000 రూపాయల చెక్ ను అందించడం జరిగింది. అలాగే వారికి నిత్యావసర సరుకులు కూడా అందిస్తాం అని తెలియజేశారు.ట్రస్ట్ తరుపున అతడిని మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామని వాళ్ల భార్య నసీమా తెలిపారు. కార్యక్రమంలోట్రస్ట్సభ్యులుతిప్పేస్వామి,హరి,లోకేష్,సురేష్,సాయి,అచ్యుత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *