సిరా న్యూస్;
నేడు ప్రపంచ కబడ్డీ దినోత్సవం
ఆటలు… ఎంతోమంది బతుకులకు బాటలు వేశాయి. ఇంగ్లండ్ దేశంలో పుట్టిన క్రికెట్ మన దేశంలో అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. మన దేశంలో క్రికెట్ ఆటకున్నంత క్రేజ్ మరో ఆటకు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే మననేలపై పుట్టి నేడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది కబడ్డీ ఆట. తమిళనాడులో ప్రాణం పోసుకున్న ‘కబడ్డీ’ ఆట, తరువాత తెలుగునేలపై ‘చెడుగుడు’గానూ అలరించింది. ఆ తరువాత ఇతర రాష్ట్రాలలోనూ కబడ్డీకి జనం జైకొట్టారు. ఎల్లలుదాటిన కబడ్డీ ప్రపంచవ్యాప్తంగానూ తన ఉనికి చాటుకుంటోంది. 2018 మార్చి 24న ‘ ప్రపంచ కబడ్డీ’ ఏర్పడింది. అప్పటి నుంచీ మార్చి 24 వతేదీని ప్రపంచ కబడ్డీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మన కబడ్డీ ఆటకు మన సినిమాలు ప్రాచుర్యం సంపాదించి పెట్టాయనే చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ మన చిత్రాలలో కబడ్డీ ఆట చోటు చేసుకొని అలరించింది.