Kabirdas:భ‌గ‌త్ సింగ్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
భ‌గ‌త్ సింగ్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి
*  తెలుగు అధ్యాపకులు కబీర్‌దాస్‌
* ఘనంగా భ‌గ‌త్‌సింగ్ వ‌ర్ధంతి
భగత్ సింగ్ స్ఫూర్తిని విద్యార్థులు యూత్ ఆదర్శంగా తీసుకోవాలని తెలుగు అధ్యాపకులు కబీర్‌దాస్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ పట్టణంలో కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్టూడెంట్ ఫోరం టిఎస్ఎఫ్ సొసైటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతి నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా భ‌గ‌త్ సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం తెలుగు అధ్యాపకులు కబీర్‌దాస్‌ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వతంత్రం కోసం నిరంతరంగా పోరాటం చేశారన్నారు. యూత్ భగత్ సింగ్ ను ప్రతి ఒక్కరు ఆదర్శం తీసుకోవాలని, భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని అన్నారు.  కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దీపక్ అశిఫాల్, అధ్యక్షుడు బి రాహుల్, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ఇఫ్తార్ ఖాన్, సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కమిటీ సభ్యులు రాకేష్, మమత, అనుసయ, నిఖిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *