Badde Naik:ప‌లువురికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత‌

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ప‌లువురికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత‌
* మూడు కుటుంబాల‌కు ఆర్థిక సహాయం
* సంస్థ చైర్మన్ బద్దే నాయక్
కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన పలువురికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆపన్న హస్తం అందించారు. శనివారం పట్టణంలోని స్టానిక ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం లో బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన సంతోష్ (లా క్రోస్ క్రీడా ),శెట్టూరు మండలం బసంపల్లి గ్రామానికి చెందిన రాజకుమార్ (కిడ్నీ వ్యాధి)కు, కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ కూతురు వివాహానికి ఒకే సారి మూడు నిరుపేద కుటుంబాలకు సాయం అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదరికంలో విద్య‌, వైద్యం అందకుండా దూరమై నష్టపోకుండా ముందుకెళ్లేలా తన వంతుగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లో సాయం చేస్తున్నామన్నారు. ఒక్కరితో సాయం చేయడం మొదలు పెట్టాం.. నేడు వందలాది మందికి సాయం చేసే అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ద్వారా కొంత మందికి, స్వయంగా కొంతమందికి సాయం చేస్తున్నామని అన్నారు. నా లక్ష్యం విద్య, వైద్యం అందరికి దగ్గర కావాలని అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటా అన్నారు. ఏ సమయం లోనైనా సమస్య తో తమను సంప్రదించిన వారికి సాయం చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *