ఉస్మానియా యూనివర్సిటి
సిరా న్యూస్;
ఉస్మానియా యూనివర్సిటీలోని మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2024 పేరుతో జాతీయ స్థాయి సింపోజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యత, విజ్ఞానం ఇటువంటి సింపోసియాల ద్వారా పెంపొందుతాయని కాబట్టి ఇటువంటివి ఎక్కడ జరిగిన పాల్గొనాలని సూచించారు.ఈ సింపోసియంలో భాగంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ మోడల్లను, స్టాళ్లను అతిథులు ప్రారంభించి, సందర్శించారు. ఇందులో అండర్ గ్రౌండ్ మైండ్ ని ఒక మోడల్ గా చిత్రీకరించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో కేజ్ వైండింగ్, డైరెక్టర్ రోప్ హాలేజ్, ఎండ్లెస్ రూప్ హాలేజ్, ఏరియల్ రోప్ వే, బెల్ట్ కన్వేయర్ వంటి మెన్ మరియు మినరల్ ట్రాన్స్‌పోర్టేషన్ పద్ధతులు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. వీటితో పాటు అండర్‌గ్రౌండ్ మైన్ వెంటిలేషన్ సిస్టమ్, బకెట్ వీల్ ఎక్స్కవేటర్, డీప్ సీ మైనింగ్ వంటి నూతన మోడల్లను తయారు చేశారు అన్నారు.