Anjaneyulu Goud: పొలిటికల్ బ్రోకర్ కౌశిక్ రెడ్డి

సిరా న్యూస్,సైదాపూర్
పొలిటికల్ బ్రోకర్ కౌశిక్ రెడ్డి
* కౌశిక్ ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే నాలుక చీరేస్తాం
* జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్
కౌశిక్ ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే నాలుక చీరేస్తామ‌ని, కుటుంబ సభ్యులను ముందు పెట్టుకొని ఓట్లలో గెలిచిన నీకు పొన్నం గురించి మాట్లాడే అర్హత లేదని, నీ కన్నా రంగులు మార్చే ఊసరవెల్లి నయం జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు. శ‌నివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్, కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు తెలుగు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. రాజకీయ వ్యభిచారి కౌశిక్ రెడ్డి అన్నారు.  మొన్నటి ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే శవ యాత్ర చేస్తా అని చెప్పి మహిళలను సెంటిమెంట్ తో ఆకట్టుకొని గెలిచిన వాడివి. అని ఆరోపించారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలోకాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నేను రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు చేరాయ‌ని తెలిపారు. కౌశిక్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. ప్రజలు నిన్ను బొంద పెడతారన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *