సిరా న్యూస్, బేల:
బేల లో ఘనంగా కామ దహనం..
అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో కామ దహన వేడుకలను ఆదివారం సాయంత్రం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాతబస్తీ, అశోక్ నగర్, ఇంద్రానగర్, తదితర కాలనీలకు చెందిన గ్రామ పెద్దలు డప్పు వాయిద్యాలతో కాముని దాహనం నిర్వహించారు. చిన్నారులు ఆడే కిర్రుం గనుక ఆట వస్తువులు, కట్టెలు, తొగరి కట్టెలు, పెండ తో చేసిన రకరకాల పరికరాలు చేసి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలని కోరారు.