సిరా న్యూస్, పెద్దపల్లి:
పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులుగా బత్తుల రమేష్
పెద్దపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు బత్తుల రమేష్, పద్మశాలి సేవా సంఘం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో బత్తుల రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల రమేష్ కు ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ మేకల మల్లేశం, ధర్మకర్తలు రాపర్తి మల్లేశం, ఆలయ సిబ్బంది, పద్మశాలి సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.