కెసిఆర్ గొప్ప నాయకుడు. ఆయన పక్కన ఉన్నవాళ్లే బ్రష్టు పట్టించారు

దానం నాగేందర్
 సిరా న్యూస్,హైదరాబాద్;
కెసిఆర్ గొప్ప నాయకుడని ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానని దానం అన్నారు. తన అభ్యర్థిత్వం పై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని అన్నారు. వాళ్లు చేసింది సభబైతే ఇప్పుడు జరుగుతున్నది సబబేనని అన్నారు. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మూడు నెలల్లో ముఖ్యమంత్రి 3500 కోట్లు సంపాదిస్తే పది సంవత్సరాల లో వాళ్లు ఎన్ని సంపాదించి ఉండొచ్చు అని ప్రశ్నించారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణలో నిజం లేదని, టిఆర్ఎస్ లో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడా పెట్టినట్టు చూపిస్తే అంతా వదులుకునేందుకు సిద్ధమని అన్నారు. టిఆర్ఎస్ లో ఓ కార్యకర్తలాగానే పని చేశానని, ఇప్పుడు ఓ కార్యకర్తలాగానే పని చేస్తూ ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో తనదే విజయమని అనంతరం ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగడం అందులో తమ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కవిత అరెస్టుపై మీడియా ప్రశ్నించగా ఒక ఆడబిడ్డ గురించి తను మాట్లాడలేనని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *