వెంకట్రామరెడ్డి ఘన విజయం ఖాయం
తెలంగాణ కు అన్యాయం చేసిన కాంగ్రెస్ , బీజేపీ
తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలి
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
సిరా న్యూస్,సంగారెడ్డి;
మెదక్ అంటేనే గులాబీ కి కంచుకోట అని, వొచ్చే మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఘన విజయం ఖాయమన్నారు..
మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి లోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు..
3 ఏళ్ళు దుబ్బాక ఎమ్మెల్యే గా పనిచేసిన రఘునందన్ రావు పని మంతుడైతే ఎందుకు చిత్తుగా ఓడగొట్టారని ఆయన ప్రశ్నించారు..దుబ్బాకలో ఓడి పోయిన బీజేపీ అభ్యర్థి మెదక్ లో ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు..
100 రోజుల్లో ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ను ప్రశ్నించారు.. డిసెంబర్9న 2 లక్షల మాపీ అన్నారు..ఇంత వరకు ఋణమాపీ జరుగలేదు..రేగోడ్ లో రుణాలు తీర్చాలని రైతులను బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు..
రైతుబంధు, కౌలు రైతులకు15 వేలు, రైతు కూలీలకు రూ 12 వేలు ఇస్తామన్నారు..కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుడు అంటే..మోస పోయినట్లే అవుతుందన్నారు..మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..చోటే బాయ్ బడే బాయ్ కథలు మనం చూసినం కదా..గుజరాత్ తరహా తెలంగాణ చేస్తా అన్నాడు…బీజేపీ తో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడన్నారు. బీజేపీ మైనారిటీ లను మోసం చేసిందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం లో మైనారిటీ లకు మంత్రి పదవి లేదన్నారు..ఇమామ్ మొజం లకు జీత భత్యాలు ఇవ్వడం జరిగిందని, రంజాన్ సందర్భంగా తోఫా ను అందజేయడం జరిగిందని, నేడు కాంగ్రెస్ నిలిపి వేసిందన్నారు..మహాలక్ష్మి పథకం లో 2500 ఏమైందన్నారు..వృద్ధులకు నెలకు 4వేల పించిన్ ఏమైందన్నారు..
..సంగారెడ్డి నియోజకవర్గంలో 50 వేల మందికి కేసీఆర్ పించిన్ ఇవ్వడం జరిగిందని, వారి దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి ఓట్లు వేయించుకోవలన్నారు..కాంగ్రెస్ వొచ్చిన తర్వాత180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆటోడ్రైవర్లు ఆత్మహత్య లు చేసుకున్నారన్నారు.
నాడు కేసీఆర్ కరోనా ఉన్నా రైతుబంధు ఇవ్వడం జరిగిందన్నారు..వడ్ల కు రూ 500 బోనస్ కోసం కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలన్నారు..నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు..ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలను కాపాడాలని, ప్రతిపక్ష పార్టీల కోసం గేట్లు తెరవడం కాదన్నారు..కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు..
కేసీఆర్ సెక్యులర్ నాయకుడని, అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు.. ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ కక్ష సాధింపు కార్యక్రమం చేపడుతుందన్నారు..ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కవితల అరెస్టు అందులో బాగమేనన్నారు. ఒక్క మెడికల్ కళాశాల ఇచ్చిందా బీజేపీ, సంగారెడ్డి లో మెడికల్ కళాశాల ఇచ్చింది కేసీఆర్ కదా అని ఆయన గుర్తు చేశారు..
మనసున్న మహారాజు వెంకట్రామరెడ్డి
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ప్రజల కోసం ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పనిచేసాడన్నారు..2014లో సంగారెడ్డి లో జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనారోగ్యంతో ఇద్దరు చని పోతే రాధా రమణి లు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు. చేస్తే దత్తత తీసుకొని అదుకున్నాడు.. ఒక అమ్మాయి వివాహం కూడా తానై చేసాడన్నారు..వెంకట్రామరెడ్డి ప్రజల మనిషని,ఘన విజయం అందించాలన్నారు..
=======================