సిరా న్యూస్,బోరబండ;
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీలో నివసిస్తున్న ఎని మిదేళ్ల బాలికపై అదే బస్తీకి చెందిన యువకుడు (22) గత మూడురోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాలిక తల్లి దండ్రులను చంపుతానని బెదిరించాడు. ఓ సంఘసేవిక సహాయంతో బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడుని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు బోరబండ పోలీస్ స్టే షన్ ముందు ఆందోళన కు దిగారు.