సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఉద్రిత్త వాతావరణం నెలకింది. ఎంపిబండి సంజయ్ తో పాటు వందలాదిమంది కార్యకర్తలు పిట్టల బస్తీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. చెంగినిగచెర్లలో గాయపడ్డ మహిళలను పరామర్శించడానికి వస్తున్న బండి సంజయ్ కి మద్దతుగా భారీ ఎత్తున బిజెపి కార్యకర్తలు వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో బారిగెళ్ళను తోసుకుంటూ బిజెపి కార్యకర్తలు ముందుకెళ్లారు.దాంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.