సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలం లొంక కేసారం గ్రామానికి చెందిన నాంసాని సుస్మిత పెళ్లికి పెద్దపల్లి లయ న్స్ ఆధ్వర్యంలో 11,116 రూపాయలు గురువారం ఆర్థిక సాయం అందజేశారు. రామగిరి మండలం లోంకకేసారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నాంసాని సుస్మిత తల్లిదండ్రులు నాంసాని లక్ష్మి రాజయ్య తల్లి తండ్రులు గతంలోనే అనివార్య కారణాల వల్ల ఇద్దరు మృతి చెందగా సుస్మిత వివాహం ఈ నెల 28 న జరగనుంది అని తెలిసి మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణ రెడ్డి యువతి యొక్క ఆర్థిక పరిస్థితిని లయన్స్ క్లబ్ పెద్దపల్లి వారికి వివరించగా వెంటనే స్పందించి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సదుల వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ మీసాల సత్యనారాయణ ,సభ్యులు ఓంకార్ గారి చేతుల మీదుగా యువతికి 11,116/- రూపాయలను అందజేయడం జరిగింది. దాతలకు కృతజ్ఞతలు ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకునేవారు ఎవరైనా 9849655990 ఫోన్ పే చేసి సహాయం చేయగలరు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంటినరీ కాలని ప్రెసిడెంట్ మోల్మురి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఒజ్జ ఓదెలు,మేకల మారుతి యాదవ్, చెల్పురీ ఓదెలు,నాంసని సందీప్ పాల్గొన్నారు.