సిరా న్యూస్, గుడిహత్నూర్
నిరుపేద వివాహానికి రవినాయక్ నగదు అందజేత
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం రాజీవనగర్ కాలనీ కి చెందిన కీర్తిశేషులు హరి తెలంగె. చంద్రకళ బాయి కూతురు కల్పనా వివాహం ఈనెల 30 వ తేదీన ఉంది. వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి నిలకడగా లేనందన ఈ విషయం గ్రహించిన బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గుడిహత్నుర్ మాజీ సర్పంచ్ పవార్ రవి నాయక్ మండల నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లారు.వివాహ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తోడుగా ఉంటానని భరోసానిచ్చారు. స్వతహాగా తక్షణ సహాయార్ధం 5 వేల రూపాయలు అందించి తన మానవత్వాన్ని చాటారు .ఈ సందర్బంగా సమాజ సేవకులు మాజీ గ్రామ సర్పంచ్ పవార్ రవి నాయక్ మాట్లాడుతు వివాహం ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఘనంగా జరగాలని, నూతన వధూవరుల దాంపత్య జీవితం సాఫీగా సాగాలని అ దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు . వీరితో పాటు బీఆర్ ఎస్ పార్టీ మండల శాఖ సీనియర్ నాయకులూ తెలంగె మాధవ్, బక్వాడ్ జయవంత్ , అనిల్ మోరే తదితరులు ఉన్నారు.