సిరా న్యూస్,రామడుగు;
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామంలో పంచమ విశంతి 25 వ వార్షికోత్సవ గీతాహవన యజ్ఞము శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శ్రీ అలివేలు మంగ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం లో భాగంగా చివరి రోజు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజరాజేశ్వర సేవాసమితి చిగురు మామిడి భక్తులు భక్తురాలు రామడుగు మండలం తిరుమలపూర్ శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి భక్తులు భక్తురాలు స్థానిక భక్తులు భక్తురాలు స్వామివారిని వాడవాడకు రథోత్సవంలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో ఇంటింటికి మహిళలు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నార్ల రమేష్ ఉపన్యాస వ్యాఖ్యాత దోనపాటి సీతారాం రెడ్డి దేవస్థాన డైరెక్టర్లు భక్త భజన మండలి ధర్మకర్తలు ఉత్సవ కమిటీ వారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.