సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో మళ్లీ అధికారంపై సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం భరోసా ఇచ్చారట. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌నిదాదాపు 25మంది నేతలు కలిశారు. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను కేసీఆర్ కొట్టిపారేసినట్లు సమాచారం. ఆగంకావద్దు.. పరేషాన్అవ్వొద్దు అంటూ కేసీఆర్ నేతలకు సూచించారట. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి.. ఎగ్జాక్ట్ పోల్స్ కళ్లముందు ఉంటాయని సీఎం వ్యాఖ్యానించారట. ఇక మూడో తేదిన సంబరాలు చేసుకుందామనినాయకులకు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రగతిభవన్ నుంచి వెళ్తూ విక్టరీ సింబల్ చూపించారు పలువురు బీఆర్‌ఎస్ నేతలు.మరోవైపు చాలాకాలం తర్వాత నిన్న రాత్రి మంచిగానిద్రపోయానన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు అతిశయోక్తిగా ఉన్నాయన్న కేటీఆర్.. కౌంటింగ్‌లో బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకుసోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కాగా ఇప్పటివరకు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో 70.79% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. డిసెంబర్ 3నజరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓట్ ఫ్రం హోమ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వివరాల మేరకురాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్ నమోదైందని వికాస్‌రాజ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. హైదరాబాద్‌లో 14 చోట్ల కౌంటింగ్ జరుగుతుందని.. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్.. ఎనిమిదిన్నర నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.