సిరాన్యూస్, జైనథ్,
ఉద్యోగికి పదవి విరమణ సహజం
* గుంటూక నాందేవ్ దంపతులకు సన్మానం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ కాన్పమేడిగూడ రోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ పొందుతున్న గుంటూక నాందేవ్ దంపతులను విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు ఘనంగా సన్మానించారు. పదవి విరమణ పొందుతున్న గుంటక నాందేవ్ మాట్లాడుతూ ఉద్యోగి జీవితంలో పదవి విరమణ అనేది చివరి అంకం అని అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం తృప్తినించిందని అన్నారు. వచ్చిన వ్యక్తులు సన్మాన గ్రహీత గొప్పతనాన్ని కొనియాడారు.సభ అధ్యక్షులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే, యం ఈ ఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు