సిరాన్యూస్, ఆదిలాబాద్
రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
* ఆదివాసీ గ్రామాల సందర్శన
వర్షాకాలం కంటే ముందే గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మండలంలోని చిచ్ దరి, ఖానాపూర్ , పలు ఆదివాసీ గ్రామాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించారు. మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా లేని గూడాలకు ద్విచక్ర వాహనంపై నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వేసవికాలం ఉండడంతో వారికి మంచినీటి సదుపాయాలు వివిధ అంశాలపై ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సందర్శించి మాట్లాడారు. అనంతరం ఆదివాసి మహిళలు సేకరించిన ఇప్పపువ్వు తయారు చేస్తున్న వివిధ పదార్థాలను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురై వర్షాకాలంలో రోడ్లు కొట్టుకపోయినా కానీ పట్టించుకోని పరిస్థితి ఉండేదని అన్నారు. గత వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోయిన రోడ్లను ఆయన సందర్శించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ పనులను వెంటనే పూర్తి చేసి వర్షాకాలం కంటే ముందే గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆదివాసి ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. వారికి సకాలంలో సరైన వైద్యం అందేలా హెల్త్ సెంటర్లను అప్రమత్తం చేస్తూ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి చేరుకోవడానికి మార్గాలన్నీ పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.