సిరాన్యూస్, ఆదిలాబాద్
సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దాం
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన స్మారక విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. తీసుకొచ్చి వారికి రాజ్యాధికారాన్ని అందించాలని ఆకాంక్షించిన మహానుభావుడని అన్నారు. మహానుభావుని చరిత్ర ఈరోజు ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌడ కుల సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.