సిరాన్యూస్, ఆదిలాబాద్
సంఘ బలోపేతానికి సభ్యులు కృషి చేయాలి
* ఎమ్మెల్యే పాయల్ శంకర్
* రజక సంఘం పట్టణ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
సంఘ బలోపేతానికి సభ్యులందరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అదిలాబాద్ పట్టణ రజక సంఘం పట్టణ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మంగళవారం స్థానిక ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ హాజరయ్యారు. రజక సంఘం అదిలాబాద్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రమాణస్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్కువార్ సంతోష్ , ప్రధాన కార్యదర్శి ముస్కు వినోద్ లను అభినందించారు. ఈసందర్భంగా సంఘ బలోపేతానికి మీరంతా కృషి చేయాలని వారు అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.