సిరాన్యూస్, జైనథ్
మహిళల హక్కులపై అవగాహన సదస్సు
జిల్లా మహిళ సాధికారత కేంద్రం, సఖి కేంద్రం సంయుక్తంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మహిళ సాధికారత పై అవగహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ యశోద భేటీ బచావో భేటీ పడావో పథకం , పీసీపీఎన్‌డీటీ , గృహ హింస చట్టం, పని చేసే చోట లైంగిక వేదింపులు, లింగ వివక్షత గురించి అవగాహన కల్పించారు. అనంతంర మెడికల్ ఆఫీసర్ సూచల,సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి పాల్గొని సఖీ సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఏఎన్ఎం , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.