మానసిక వికలాంగులకు భోజనము ఏర్పాటు

సిరా న్యూస్,కమాన్ పూర్;
పెద్దపల్లి లోని స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో ఆధ్వర్యంలో వికలాంగులకు భోజనం ఏర్పాటు చేశారు.కమాన్ పూర్ ఎల్లమ్మ బోనాల శుభ సందర్భంగా మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో భోజనం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ మహిళా అధ్యక్షురాలు నారగోని సరిత ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎల్లమ్మ బోనాల సంతోష సమయంలో తమతో పాటు నలుగురికి సంతోషాన్ని అందిస్తూ తమ వంతు సాయంగా నిలిచి ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన ఆసం శ్రీకాంత్ ,మెడగోని విజయ్, నారగోని సరిత ,మల్యాల విజయ్, గీసగొని శ్రీనివాస్, చెన్నురి అభిలాష్ , ఇనగంటి రోహిత్ రావు లకు హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *