Padmasali community: నిరుపేద వివాహానికి ప‌ద్మ‌శాలి సంఘం ఆర్థిక సాయం

సిరా న్యూస్,చొప్పదండి
నిరుపేద వివాహానికి ప‌ద్మ‌శాలి సంఘం ఆర్థిక సాయం

చొప్పదండి మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన సాంబారి కావ్య వివాహానికి జిల్లా పద్మశాలి సంఘం ఆర్థిక సాయం అంద‌జేశారు. జిల్లా పద్మశాలి సంఘం కరీంనగర్ రూ.18000, పట్టణ పద్మశాలి సంఘం కరీంనగర్ రూ.11000, పద్మశాలి సంక్షేమ వెల్ఫేర్ ట్రస్ట్ కరీంనగర్ రూ.8000, కోపా కరీంనగర్ రూ.6000, నేత బజార్ కమిటీ కరీంనగర్ రూ.5000, మండల పద్మశాలి సంఘం చొప్పదండి 2500, రుద్ర సుదర్శన్ 3300 (50 కేజీల బియ్యం )కొత్తపల్లి పద్మశాలి యువజన సంఘం 3300 ( 50 కేజీల బియ్యం) అనుబంధ సంఘాలు, కుల బంధాల ద్వారా వచ్చిన రూపాయలు 31,210 కుల బాంధవులు అందరూ కూడా ఆర్థిక సహాయం అంద‌జేశారు. మొత్తం రూపాయలు 88310 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన దాతలు అందరికి జిల్లా పద్మశాలి సంఘం ప్ర‌ధాన కార్యదర్శి , మాజీ ఎంపీపీ చొప్పదండి వల్లాల క్రిష్ణహరి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *